ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి | Engineering student dies in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

Nov 22 2015 9:47 AM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.

కందుకూరు అర్బన్ : ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కందుకూరులో ఓ వేడుకకు హాజరై ఆదివారం ఉదయం తిరిగి వెళుతున్నారు.

8 గంటల సమయంలో ఒంగోలు రోడ్డులోని లారీ స్టాండ్ సమీపంలో ఎదురుగా వచ్చిన కందుకూరు డిపో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అనే విద్యార్థి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. జశ్వంత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement