మహిళతో డీఎస్పీ అసభ్య ప్రవర్తన..సస్పెన్షన్‌

DSP Suspended By Misbehaving With Women Guntur - Sakshi

వివాహితతో అసభ్యంగా ప్రవర్తన 

సస్పెండ్‌ చేసిన డీజీపీ

సాక్షి, గుంటూరు : అర్బన్‌ జిల్లా మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వి.రమేష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ విలేకర్లకు తెలిపారు. మేడికొండూరు మండలానికి చెందిన ఓ వివాహిత భర్తతో నెలకొన్న మనస్పర్థలపై ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్‌ కోసం మహిళా పోలీస్‌ స్టేషన్‌కు సిఫార్స్‌ చేశారు. ఈ క్రమంలో మహిళతో డీఎస్పీ అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో దీనిపై ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా విచారణ చేపట్టి నివేదికను ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ద్వారా డీజీపీకి పంపారు. నివేదికను పరిశీలించిన డీజీపీ వెంటనే డీఎస్పీని సస్సెండ్‌ చేశారు. ఈ మేరకు సస్పెండ్‌ ఉత్తర్వులు డీఎస్పీకి అందజేశామని ఎస్పీ వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top