సీఎం ఆదేశాలు పట్టించుకోవద్దు | Do not obey Kiran Kumar Reddy orders, says Damodar Raja Narasimha | Sakshi
Sakshi News home page

సీఎం ఆదేశాలు పట్టించుకోవద్దు

Feb 4 2014 1:43 AM | Updated on Sep 27 2018 8:33 PM

సీఎం ఆదేశాలు పట్టించుకోవద్దు - Sakshi

సీఎం ఆదేశాలు పట్టించుకోవద్దు

కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివాదాల పేరిట ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

*  సీఎస్‌కు ఉప ముఖ్యమంత్రి లేఖ
 
సాక్షి, హైదరాబాద్:  కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివాదాల పేరిట ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తోందని, ఈ విషయమై మంత్రివర్గం అనుమతి లేకుండా ఆయన ఇచ్చే ఆదేశాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోరాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కోరారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా ప్రభుత్వం తరఫున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చట్ట, న్యాయ విరుద్ధమని సోమవారం సీఎస్‌కు మూడు పేజీల లేఖ రాశారు.

‘‘ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కరే కాదు. మంత్రివర్గ సమిష్టి నిర్ణయాల మేర కే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని సుప్రీంకోర్టు పలు కేసుల్లో స్పష్టం చేసింది. 2006లో రామేశ్వర ప్రసాద్  వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసుతో పాటు 1977లో కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ కేంద్రం కేసుల కు సంబంధించిన సుప్రీం తీర్పులు ఈ విషయూన్ని తేటతెల్లం చేస్తున్నారుు. కాబట్టి చట్టవిరుద్ధ ఆదేశాలను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిది. 

ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరుగుతున్నందున కేంద్ర, రాష్ర్ట సంబంధాల పరిధిలోకి ఈ అంశం రాదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు వీలులేదు. అలా చేస్తే రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రివర్గ సభ్యుడిగా కోరుతున్నా. కేబినెట్ అనుమతి లేని అంశాలపై సీఎం లేదా మంత్రులిచ్చే ఆదేశాలను పట్టించుకోవద్దు. సీఎం కూడా కేబినెట్‌లో సభ్యుడు మాత్రమే. ఆయన తలపెడుతున్న న్యాయవిరుద్ధ చర్యల్లో మీరు భాగస్వాములు కావొద్దు’’ అని డిప్యూటీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement