ఏపి విభజన మంచిదికాదు: ఎస్పి | Division is not Good: SP | Sakshi
Sakshi News home page

ఏపి విభజన మంచిదికాదు: ఎస్పి

Aug 12 2013 8:50 PM | Updated on Sep 1 2017 9:48 PM

ఏపి విభజన మంచిదికాదని సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరేష్ అగర్వాల్ అన్నారు.

హైదరాబాద్: ఏపి విభజన మంచిదికాదని సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరేష్ అగర్వాల్ అన్నారు. రాజ్యసభలో ఈరోజు తెలంగాణపై జరిగిన సుదీర్ఘ చర్చలో ఆయన మాట్లాడారు. ఏ ప్రాతిపదికన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు గతంలో నెహ్రూ వ్యతిరేకించారు. ఇప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? పరిపాలనా సౌలభ్యం కోసమైతే దేశాన్ని కూడా విభజిస్తారా? అని ఆయన  అడిగారు.

గతంలో  ఏర్పడిన మూడు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విభజించనున్నారన్నారు. తెలంగాణలో 15 లోక్సభ స్థానాలను గెలవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం అని, అందు కోసమే రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకుందని నరేష్ అగర్వాల్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement