జిల్లా వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలుండాలి | District website, comprehensive details | Sakshi
Sakshi News home page

జిల్లా వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలుండాలి

Oct 25 2014 1:23 AM | Updated on Mar 21 2019 7:25 PM

జిల్లా వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలుండాలి - Sakshi

జిల్లా వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలుండాలి

ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు రూపొందించిన జిల్లా ప్రత్యేక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఉంచాలని కలెక్టర్ కాటమనేని

 ఏలూరు : ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు రూపొందించిన జిల్లా ప్రత్యేక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఉంచాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెబ్‌సైట్ నిర్వహణపై నోడల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ  తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ సమగ్ర సమాచారంతో పాటు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు, లబ్ధిదారుల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. ప్రతి 15 రోజులకొకసారి తా జా సమాచారాన్ని పొందుపర్చి ప్రజలు మెరుగైన సమాచారం పొందేలా పర్యవేక్షించాలన్నారు.
 
 ప్రతి శాఖకు యూజర్ ఐడీ, పాస్‌వ ర్‌‌డను కేటాయించామన్నారు. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు వివిధ శాఖల జిల్లా అధికారులు, నోడల్ అధికారులతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అప్పటిలోగా ఆయాశాఖలకు చెందిన పూర్తి సమాచారాన్ని ఠీఠీఠీ.ఠ్ఛీట్టజౌఛ్చీఠ్చిటజీ.్చఞ.జౌఠి.జీ  వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. అసంపూర్తిగా సమాచారం ఉంటే అటువంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా శుక్రవారం సమావేశం హాజరుకాని నోడల్ అధికారులకు మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశాలకు గైర్హాజరైతే సహించేది లేదని, నిర్దేశించిన సమయానికి విధిగా హాజరు కావాలని కలెక్టర్ అన్నారు. లేకపోతే అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిక్‌నెట్ అధికారి శర్మ, ప్రవీణ్ వె బ్‌సైట్ నిర్వహణ, సమాచారాన్ని అప్‌లోడ్ చేసే విధానాన్ని సమగ్రంగా వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement