breaking news
Special Web site
-
జిల్లా వెబ్సైట్లో సమగ్ర వివరాలుండాలి
ఏలూరు : ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు రూపొందించిన జిల్లా ప్రత్యేక వెబ్సైట్లో పూర్తి వివరాలను ఉంచాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెబ్సైట్ నిర్వహణపై నోడల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ సమగ్ర సమాచారంతో పాటు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు, లబ్ధిదారుల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపర్చాలన్నారు. ప్రతి 15 రోజులకొకసారి తా జా సమాచారాన్ని పొందుపర్చి ప్రజలు మెరుగైన సమాచారం పొందేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి శాఖకు యూజర్ ఐడీ, పాస్వ ర్డను కేటాయించామన్నారు. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు వివిధ శాఖల జిల్లా అధికారులు, నోడల్ అధికారులతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అప్పటిలోగా ఆయాశాఖలకు చెందిన పూర్తి సమాచారాన్ని ఠీఠీఠీ.ఠ్ఛీట్టజౌఛ్చీఠ్చిటజీ.్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందుపర్చాలన్నారు. అసంపూర్తిగా సమాచారం ఉంటే అటువంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా శుక్రవారం సమావేశం హాజరుకాని నోడల్ అధికారులకు మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశాలకు గైర్హాజరైతే సహించేది లేదని, నిర్దేశించిన సమయానికి విధిగా హాజరు కావాలని కలెక్టర్ అన్నారు. లేకపోతే అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిక్నెట్ అధికారి శర్మ, ప్రవీణ్ వె బ్సైట్ నిర్వహణ, సమాచారాన్ని అప్లోడ్ చేసే విధానాన్ని సమగ్రంగా వివరించారు. -
కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నియోజకవర్గాలకు గానూ 99 టేబుళ్ల ద్వారా మొత్తం 253 రౌండ్లలో ఓట్లు లెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అత్యధికంగా సతుపల్లి 36 రౌండ్లు, తరువాత అశ్వారావుపేట నియోజకవర్గానికి 29 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 197 రౌండ్లలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆయా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గెలుపొందిన అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. అలాగే ఎంపీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల వివరాలు కూడా అసెంబ్లీ ఫలితాల రౌండ్ల మాదిరిగానే వెల్లడిస్తారు. అయితే పార్లమెంట్ పూర్తి ఫలితాల వివరాలు విజయ ఇంజనీరింగ్ కళాశాలలో వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేర్వేరుగా ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇల్లెందు, పినపాక, ఖమ్మం అసెంబ్లీ ఫలితాలు ముందుగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌కు 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 99 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 700 మంది సిబ్బందిని నియమించారు. వారిలో 200 మందిని కౌంటింగ్ సూపర్వైజర్లుగా, 500 మందిని కౌంటింగ్ అసిస్టెంట్లుగా నియమించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూండంచెల భద్రత కల్పిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రౌండ్ల వారీ ఫలితాల కోసం ఉఇఐ.ూఐఇ.ఐూ వెబ్సైట్లో సంప్రదించవచ్చు.