సినిమాలకు వినోదమే ప్రాణం | Sakshi
Sakshi News home page

సినిమాలకు వినోదమే ప్రాణం

Published Mon, Mar 14 2016 4:56 AM

సినిమాలకు వినోదమే ప్రాణం - Sakshi

సాక్షితో దర్శకుడు ముళ్ళపూడి వీరభద్రం
‘రెండున్నర గంటలసేపు సినిమా చూసే ప్రేక్షకుడు ప్రధానంగా వినోదం కోరుకుంటాడు. సినిమాకు వినోదమే ప్రాణం’ అని ప్రముఖ దర్శకుడు ముళ్ళపూడి వీరభద్రం అన్నారు. ‘చుట్టాలబ్బాయి’ సినిమా షూటింగ్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’తో నేటి సినిమాల తీరుతెన్నులు, తన సినీ ప్రస్థానం గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 - రాజమహేంద్రవరం కల్చరల్

 
‘మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు సమీపంలోని కలవలపల్లి. బీకాం చదివాక, ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ప్రోత్సాహంతో కృష్ణవంశీ, తేజలవద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశాను. అల్లరి నరేష్ హీరోగా ‘అహ నా పెళ్ళంట, సునీల్ హీరోగా పూలరంగడు, నాగార్జున హీరోగా తీసిన భాయ్ సినిమాలకు దర్శకత్వం వహించా ను. ప్రస్తుతం ఆదితో ‘చుట్టాలబ్బాయి’ చేస్తున్నా ను.

గోదావరి తీరంలో వెటకారం, హాస్యం సిని మాలను బతికిస్తాయి. కుటుంబ కథాచిత్రాలకు కాలం చెల్లినట్టేనని నేను భావించడం లేదు. ఏ సినిమా అయినా, చివరికి క్రైమ్ థ్రిల్లర్ అయినా, వినోదం ఉండడం తప్పనిసరి. మణిరత్నం నా అభిమాన దర్శకుడు. షూటింగులకు రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రం కావాలి.’

Advertisement
Advertisement