టీడీపీ నాయకులంతా ఇసుక మాఫియాలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇసుక రేవును తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లగొడుగున్నారని, ఆ పార్టీ నాయకులంతా ఇసుక మాఫియాలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.
అక్రమాలకు పాల్పడుతున్న తమ పార్టీ నేతలకు బాబు సర్కార్ తోడ్పాటు అందిస్తున్నదని ఆరోపించారు. అక్రమార్కులపై చర్చలు తీసుకునేందుకు జిల్లాల్లో అధికారులు ఎందుకు బయపడుతున్నరని ప్రశ్నించారు.