జగన్‌తోనే సంక్షేమ రాజ్యం | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే సంక్షేమ రాజ్యం

Published Wed, Feb 26 2014 4:01 AM

జగన్‌తోనే సంక్షేమ రాజ్యం - Sakshi

చల్లపల్లి,
 దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఏనాడూ విద్యుత్, గ్యాస్ ధరలు పెంచలేదని ఆయన వారసుడు, ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆనాటి మంచిరోజులు వస్తాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు అన్నారు.

 

చల్లపల్లి పంచాయతీ పరిధిలోని నారాయణరావునగర్‌లో మంగళవారం గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని సింహాద్రి చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచినా  రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వాటిని భరించి ప్రజలపై భారం పడకుండా చూసిందన్నారు. తన పాలనలో విద్యుత్‌చార్జీలు పెంచబోనని స్పష్టం చేసిన వైఎస్ మాటతప్పలేదు, మడమ తిప్పలేదని సింహాద్రి గుర్తుచేశారు.

 

ఆయన తనయుడు, ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడతారన్నారు. పార్టీ మండల కన్వీనర్ చండ్ర వెంకటేశ్వరరావు, మహిళా క న్వీనర్ వల్లూరి ఉమ, పట్లణ కన్వీనర్ వెనిగళ్ళ తారకజగదీష్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షేక్ నజరానా, మద్దాల వీరాస్వామి, గోవాడ రాము,  మశీదు కమిటీ అధ్యక్షుడు అబ్ధుల్ గఫార్, ఆరోవార్డు సభ్యుడు తోట నాగేశ్వరరావు, నాయకులు మల్లంపాటి సీతారామయ్య, ఆకుల శ్రీనివాస్, యన్నం చంద్రశేఖర్, మురాల చిన్ని              పాల్గొన్నారు.
 

 

తెలుగురావుపాలెంలో

 

 ఘంటసాల : మండలంలోని తెలుగురావుపాలెంలో మంగళవారం సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌కుమార్ సర్కార్ తుంగలో తొక్కి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి ఆ పార్టీతో కుమ్మకై  ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజలను వంచించిన ఆ రెండు పార్టీలకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ప్రజలకోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీని ఆదరించాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ వేమూరి వెంకట్రావ్, బీసీ కన్వీనర్ చింతా రామచంద్రరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కడవకొల్లు నరసింహారావు, స్థానిక నాయకులు తాడికొండ శ్రీను, సింహాద్రి శ్రీను, అట్లూరి శ్రీనివాసరావు, కాట్రగడ్డ శ్రీనివాస్ చక్రవర్తి, అట్లూరి రాము, రావి రాంబాబు, జాస్తి వెంకటేశ్వరరావు, వినిగళ్ళచైతన్య, పర్యతనేని రామకృష్ణ, న్యాయవాది తాడిశెట్టి రాంబాబు, వెనిగళ్ళ శ్రీధర్, మునిపల్లి నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement