చిత్తూరు కలెక్టరేట్‌లో ఎలక్షన్ విభాగంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న సుధాకర్ బుధవారం విధి .....
చిత్తూరు (అగ్రికల్చర్): చిత్తూరు కలెక్టరేట్‌లో ఎలక్షన్ విభాగంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న సుధాకర్ బుధవారం విధి నిర్వహణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డిప్యూటీ తహశీల్దారు సుధాకర్ ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. కొంత సమయానికే తాను కూర్చున్న సీటు పైనుంచి సృ్పహ కోల్పోయి కింద పడిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆయన అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగడంతో ఆయన స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్‌వో విజయ్‌చందర్‌ను వివరణ అడగ్గా కుటుంబ కలహాల కారణంగా సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.