అమ్మడం, అమ్ముడుపోవడం ఆయన నైజం | dalit leaders fired on TG venkatesh | Sakshi
Sakshi News home page

అమ్మడం, అమ్ముడుపోవడం ఆయన నైజం

Nov 1 2017 1:26 PM | Updated on Aug 10 2018 8:31 PM

dalit leaders fired on TG venkatesh - Sakshi

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు

కర్నూలు  సీక్యాంప్‌: అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అడ్డంగా అమ్ముడుపోయిన వ్యక్తి టీజీ వెంకటేశ్‌ అని, ఆయన జీవితమంతా అమ్మడం, కొనడం, అమ్ముడుపోవడంతోనే ముడిపడిందని జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో మంగళవారం ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో విదేశీ ఆర్యవైశ్య, ఆర్యబ్రాహ్మణుల క్విట్‌ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సంఘాల నేత లు టీపీ శీలన్న, బాలసుందరం, వేల్పుల జ్యోతి, పట్నం రాజేశ్వరి, గోపి, శేషఫణి, లక్ష్మీనరసింహా, విజేయుడు మాట్లాడారు.

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ది మధ్య ఆసియా దేశమని, ఇతర దేశానికి చెందిన ఆయనకు ఈ దేశ మూలవాసి కంచె ఐలయ్యపై నోటికొచ్చినట్టు మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో స్థితిగతులు, జన జీవనంపై పుస్తకం రాసిన ప్రొఫెసర్‌ ఐలయ్యను చంపాలని, ఆయన పుస్తకాలు నిషేధించాలని టీజీ వెంకటేశ్‌ లాంటి వారు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్య దళిత, బహుజన సంపద అని, ఆయనను కాపాడుకోవడం ఈ దేశ మూలవాసుల బాధ్యత అన్నారు. విదేశీ ఆర్యవైశ్యులు, విదేశీ బ్రాహ్మణులు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement