సైకిల్.. సవారీ | Cycle .. Riding | Sakshi
Sakshi News home page

సైకిల్.. సవారీ

Nov 15 2013 3:16 AM | Updated on Sep 2 2017 12:36 AM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం సైకిల్‌ర్యాలీ నిర్వహించారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కనగల్, నిడమనూరు, హాలియా, పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల గుండా
 65 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. సాగర్ వరకు ఎస్పీ ప్రభాకర్‌రావు స్వయంగా సైకిల్ తొక్కారు.
 - సాక్షి, నల్లగొండ/న్యూస్‌లైన్, హాలియా
 
 సాక్షి, నల్లగొండ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ సాగింది. బడికి వెళ్లాల్సిన వయస్సులో చిన్నారులు వెట్టిచాకిరీ చేయడం సమాజానికి మంచిది కాదని ఎస్పీ అన్నారు. చట్టాలెన్ని వచ్చినా ప్రజల్లో చైతన్యం లేకపోవడం కారణంగానే చిన్నారులు కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భావిభారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించి దేశ ప్రగతిలో పాలు పంచుకునేలా చేయాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సీఐలు మనోహర్‌రెడ్డి, డి. లక్ష్మణ్, రవి పాల్గొన్నారు.  
 
 ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే  సైకిల్‌యాత్ర : ఎస్పీ
 హాలియా: బాలకార్మిక వ్యవస్థ నిర్మూల నపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే పోలీస్ శాఖ పక్షాన నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపా రు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ప్రకారం చిన్నారులను పనికి పంపినా,పనిలో పెట్టుకున్నా చట్టరీత్యా నేరస్తులవుతారని హెచ్చరించారు.  ముఖ్యంగా మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్‌లో బడిఈడు పిల్లలను పత్తి,బత్తాయి తోటల్లో కూలీలుగా పంపుతున్నారని పేర్కొన్నారు.
 
 వారిలో చైతన్యం కలిగించేందుకే తమ వంతు కృషిగా బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించాలని కోరారు. సమావేశంలో మిర్యాలగూడెం డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, హాలియా, మిర్యాలగూడెం, హుజూన్‌నగర్ సీఐలు ఆనందరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బల్వంతయ్య తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement