
సంక్రాంతి సంతోషమే వేరబ్బా
తెలతెలవారుతుండగానే నిద్రలేచి.. భోగి మంటల్లో కాచిన వేడినీళ్లతో తలారా స్నానం చేసి.. ఇంటి ముంగిట రంగవల్లులు....
సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి
ఆప్యాయత, అనురాగాలను పెంచుతాయి
కోడి పందాలు, జూదాలు వేస్ట్
వాటిపై ఉక్కుపాదం మోపడమే బెస్ట్
ఏలూరు సిటీ/వన్‌టౌన్/బిర్లాభవన్ సెంటర్ : తెలతెలవారుతుండగానే నిద్రలేచి.. భోగి మంటల్లో కాచిన వేడినీళ్లతో తలారా స్నానం చేసి.. ఇంటి ముంగిట రంగవల్లులు వేసి.. గొబ్బెమ్మలతో అలంకరించి.. చిన్నారులకు బోగిపళ్లు పోసి.. నోరూరించే పిండి వంటల్ని కడుపారా తింటూ కుటుంబ సభ్యులు, బంధువులతో ఆప్యాయత, అనురాగాల పంచుకునే పండగ సంక్రాంతి వచ్చేస్తోంది. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సంప్రదాయూలను కచ్చితంగా పాటించాలని యువత నినదించింది. కోడి పందాలు.. ఇతర జూద క్రీడల్లో మునిగి తేలడం తగదని స్పష్టం చేసింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం వల్ల తమలో చాలామందికి సంప్రదాయాలపై సరైన అవగాహన లేదని యువత పేర్కొంది. సంప్రదాయూలను కొనసాగించకపోతే భవిష్యత్‌లో యువతపై దుష్ర్పభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెరుుంట్ జోసఫ్ దంత వైద్య కళాశాల విద్యార్థులు సంక్రాంతి సంప్రదాయూలు, జూద క్రీడలపై తమ మనోగతాన్ని ఇలా ఆవిష్కరించారు.
నాగరికత దెబ్బతింటుంది
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు వ్యక్తిగత జీవితాలు పెరిగిపోయాయి. బాంధవ్యాలకు విలువ లేకుం డా పోతోంది. పండగ రోజైనా అందరూ కలిసి సంతోషంగా గడపాలనే పరిస్థితి లేదు. దీనివల్ల నాగరికత దెబ్బతింటుంది.
- కె.శ్రీధర్‌రెడ్డి
కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి
మన సంప్రదాయాలు, సంస్కృతి గురించి తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలి. ప్రేమానురాగాలు పెరగాలన్నా.. సమాజం బాగుండాలన్నా అది మన ఫ్యామిలీ నుంచే ప్రారంభం కావాలి. అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుంది.
- డి.నిహిత
ట్రెండ్స్ పేరుతో పెడదారులు
వినూత్నంగా చేయాలనే ఆలోచనతో ఏదేదో చేసేస్తున్నారు. మన సంప్రదాయం వెనుక ఉన్న ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. మన సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచే పరికిణి, ఓణీ, చీరకట్టు మహిళల అందాన్ని మరింత పెంచుతాయనే విషయాన్ని మర్చిపోతున్నారు.
- డి.స్వాతి
ఒక పెళ్లిలా..
పెళ్లంటే ఇల్లంతా ఎంత సందడి ఉంటుందో సంక్రాంతి పండగ రోజుల్లోనూ అలాగే ఉంటుంది. ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉంటారు. తెల్లవారుజామునే తలారా స్నానం, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టటం, బోగి పళ్లు పోయటం వంటి కార్యక్రమాలన్నీ గొప్ప అనుభూతుల సమాహారం. - టి.రాజ్యలక్ష్మి
ప్రేమానుగారాల నెలవు
కుటుంబ సభ్యులు, బంధువులంతా ఒకచోట చేరి పండగ చేసుకుంటే ఆ ప్రేమానురాగాలతో జీవితం ధన్యమౌతుంది. భోగి రోజున పాత జీవితాన్ని వదులుకుంటానంటూ భోగి పిడకల్ని మంటల్లో వేస్తారు. సంక్రాంతి గొప్పతనం, మజాయే వేరు
- వై.తేజస్వి
జూదం ఆచారమా
సంక్రాంతి సందర్భంగా కోడి పందాలపై చర్చ జరుగుతోంది. దీనిని అనాదిగా వస్తున్న ఆచారంగా రాజకీయ నాయకులు చెబుతున్నారు. జూదమాడటం సంప్రదాయమా. కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టులే కోడిపందాలు నిర్వహించవద్దని చెప్పినప్పుడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలిగా. - డి.వేణు
జూదగాళ్ల ఆటల్ని సాగనివ్వొద్దు
పండగ పేరుతో సంప్రదాయానికి ముడిపెట్టి కోడిపందాలు అడితే వాటిని ఆపాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. అవినీతి పెరిగిపోవటం వల్లే జూదరుల ఆటలు సాగుతున్నాయి. రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే పోలీస్ అధికారులు వంత పాడటం కరెక్ట్ కాదు.
- సీహెచ్ రాజేష్
వ్యాపారం కాకూడదుగా
పండగ పేరుతో మూగజీవాలను హింసించటం న్యాయం కాదు. కోడిపందాల్లో బెట్టింగ్‌లు వేయడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ఆర్థికంగా నష్టపోరుు రోడ్డున పడుతున్నారు. కుటుంబాలు చితికిపోవటం ఆయూ కుటుంబాలకే కాదు.. సమాజానికీ మంచిది కాదు.
- వి.శ్రావణి
పండగంటే జల్సాలు చేయడం కాదు
గ్రామాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఉంది. పట్టణాలు, నగరాల్లో పండగల విశిష్టత, విలువ తెలియడం లేదు. పండగ రోజు జల్సాలు చేస్తే సరిపోతుందనే విధానంలో మార్పు రావాలి.
- సీహెచ్ హర్షిణి