దేశ ప్రగతిలో రైల్వేలు కీలకమని గుత్తి రైల్వే డీజిల్‌షెడ్ సీనియర్ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఆయన బెలూన్లను ఎగురవేసి గుత్తి రైల్వే లోకో డీజిల్ షెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు.
గుత్తి, న్యూస్‌లైన్: దేశ ప్రగతిలో రైల్వేలు కీలకమని గుత్తి రైల్వే డీజిల్‌షెడ్ సీనియర్ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఆయన బెలూన్లను ఎగురవేసి గుత్తి రైల్వే లోకో డీజిల్ షెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వేలు ప్రజా జీవితంతో పెనవేసుకుపోయాయన్నారు. డీజిల్‌షెడ్‌గా అవతరించి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమన్నారు.
అధికారులు, ఉద్యోగులు, కార్మికుల కృషి, ప్రజల సహాయ సహకారాలతోనే డీజిల్‌షెడ్ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం రైల్వే ఇన్‌స్టిట్యూట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్‌వీ మోటార్స్ (హీరో షోరూమ్), శ్రీకరం మోటార్స్ స్టాల్స్‌ను ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు లీలా శ్రీనివాస్‌తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎస్‌బీహెచ్, ఫాస్ట్‌ఫుడ్, బేకరీ, హైదరాబాద్ శారీస్, ధర్మవరం పట్టు చీరలు, కిచెన్ వేర్స్, యమహా, టీవీఎస్, తదితర స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరత నాట్యం, కూచిపుడి, కథక్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సినిమా పాటలకు చేసిన డాన్స్‌లు అలరించాయి. అంతకు ముందు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు సీనియర్ డీఎంఈ శ్రీనివాస్‌కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైల్వే యూనియన్ల నాయకులు రాజమోహన్‌రెడ్డి, నారాయణ, రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్, చినబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.