పత్తి రైతు చిత్తు | Cotton farmer draft | Sakshi
Sakshi News home page

పత్తి రైతు చిత్తు

Sep 22 2013 4:02 AM | Updated on Oct 16 2018 3:25 PM

అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. గతేడాది అనావృష్టి.. ఈ ఏడాది అతివృష్టి పత్తి రైతును చిత్తుచేశాయి.

గద్వాల/నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. గతేడాది అనావృష్టి.. ఈ ఏడాది అతివృష్టి పత్తి రైతును చిత్తుచేశాయి. ఈ ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో పత్తిపంట సాగుచేస్తే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కీలకమైన క్రాసింగ్‌దశలో వర్షం కురుస్తుండటంతో విత్తన పత్తిపూత రాలిపోతుం ది. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పత్తిపైరు తెగుళ్లబారినపడి ఎర్రగా మారిం ది. వరదనీటిలోనే మురిగిపోతుంది. ఇ ప్పటికే దోమకాటు తెగులు పత్తిపంట ఆ శించడంతో ఎన్ని మందులు పిచికారి చేసినా వర్షాల కారణంగా ఫలితం లే కుండాపోయింది.
 
 పత్తి విత్తనరైతులు ఏ టా ఏప్రిల్‌లో పంటను విత్తుకుని మే చి వరి నుంచి జులై చివరి వరకు క్రాసింగ్ చేసుకునేవారు. అయితే ఈ సారి పత్తి విత్తనాలను రైతులకు ఇచ్చే విషయంలో కంపెనీలు జాప్యం చేయడంతో జూన్ ఆఖరి నుంచి రైతులు తమ పొలాల్లో ప త్తిని సాగు చేసుకున్నారు. 100రోజుల తరువాత మగ, ఆడ పువ్వులకు క్రాసిం గ్ చేసుకునేవారు. ప్రస్తుత కీలక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. పంట కాపు సమయంలో వర్షాలు అధికమవడంతో ఆశించిన కాయలు రాక, తెగుళ్లను నివారించుకోలేక రైతులు అయోమయంలో పడ్డారు.
 
 విత్తనపత్తి రైతుకు తీవ్ర నష్టం
 వాతావరణ పరిస్థితులు అనుకూలించే నడిగడ్డ ప్రాంతంలో రైతులు ఈ ఖరీఫ్ లో సుమారు 30వేల ఎకరాల్లో విత్తనపత్తిని సాగుచేశారు. ఇందుకోసం ప్రతి ఎ కరా సాగుకోసం రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్ర తిరైతు ఎక్కువ విస్తీర్ణంలోనే సాగుచేశా డు. పంటకాపు ప్రారంభమయ్యే దశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతుకు ఇ బ్బందికరంగా మారింది. వర్షాల కారణంగా పొలంలో పంటకు ఉపయోగప డే ఎలాంటి ఎరువులను వేసుకునే పరిస్థి తి లేకుండాపోయింది. తెగుళ్ల ఉధృతి కూ డా మొదలైంది. పంటను కాపాడుకోలే రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు.
 
 రైతు కష్టం వర్షార్పణం
 ఈ ఏడాది నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 70వేల ఎకరాల్లో పత్తి సాగయింది. ఇందుకోసం రైతులు సుమారు రూ.105 కోట్లు ఖర్చుచేశారు. ఒక్కోరైతుసాగుకోసం రూ.20 నుంచి రూ.28వేల వరకు ఖర్చుచేశారు. తొలుత సకాలంలో వర్షాలు కురవడంతో పైర్లు కూడా ఆశాజనకంగా ఎదిగాయి. అయితే నెలరోజులుగా భారీ ముసురు వర్షాలు పత్తి పంటను తీవ్రంగా నష్టపరిచాయి. ఎదిగిన పైరుకు తొలుత గూడ(పత్తికాయ) చక్కగా కాసింది. దీంతో ఈసారి దిగుబడి భారీగా వస్తుందని రైతులు భావించారు.
 
 
 వర్షాలు కూడా అనుకూలించడంతో పెట్టుబడులకు ఏమాత్రం వెనకంజ వేయలేదు. వర్షాలు ఎడతెరిపి ఇచ్చి కాస్త ఎండ రాగానే ఎరువులు, పురుగు మందులు చల్లుతూ వచ్చారు. కాగా కొంతకాలంగా వరుసగా వస్తున్న వర్షాలు పత్తిపంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నల్లరేగడి నేలలో పొలాల్లో నీరు నిలిచి ఎదుగుదల ఆగిపోయింది. ఆకులు ఎర్రగా మారాయి. గూడ కొంత రాలిపోగా మరికొంత పక్వం కాకముందే కాయ పగిలి వర్షాలకు తడిసి పత్తి నల్లగా మారుతోంది. కొత్తగా కాయలు కాయకపోవడం, ఉన్న వాటి పరిస్థితి ఇలా కావడంతో దిగుబడి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది.
 
 రూ.140కోట్లకు పైగా పంటనష్టం
 సాధారణంగా ఎర్ర, ఇసుక నేలల్లో ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒండ్రుమట్టి నేలల్లో 8నుంచి12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఆ లెక్కన సరాసరి ఈ ఏడాది ఐదు లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి రావాల్సి ఉంది. దీనికి ధరను పరిశీలిస్తే రూ.250కోట్ల ఆదాయం రైతులకు రావాల్సి ఉంది. అయితే అతివృష్టి ఫలితంగా పరిస్థితి తారుమారైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement