ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 8ని సవాలు చేస్తూ హైకోర్టులో న్యాయవాది కె.ఆర్.రామన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, గవర్నర్, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు
హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 8ని సవాలు చేస్తూ హైకోర్టులో న్యాయవాది కె.ఆర్.రామన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, గవర్నర్, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన విధులే తప్ప ఈ చట్టం ద్వారా గవర్నర్‌కు అదనపు బాధ్యతలను అప్పగించడానికి వీల్లేదన్నారు.
మంత్రి మండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలని, కొన్ని సందర్భాల్లో మాత్రంవిచక్షణ మేరకు స్వీయ నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. సెక్షన్ 8 రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల కొట్టి వేయాలని కోరా రు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు కల్పించిన విశేషాధికారాలను అమలు చేయాలంటూ కేంద్ర హోంశాఖ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాయటం రాష్ట్రఅధికారాల్లో జోక్యం చేసుకోవడమేనన్నారు.