కానిస్టేబుళ్ల కుటుంబాలకు చెక్కులు పంపిణీ | Constable Checks distributed families | Sakshi
Sakshi News home page

కానిస్టేబుళ్ల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

Sep 12 2013 2:21 AM | Updated on Mar 19 2019 5:52 PM

ఇటీవల విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు

 ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ఇటీవల విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ఏవీ రంగనాథ్ రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పి.ఏడుకొండలు, సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కామేశ్వరరావు అనారోగ్యంతో మృతిచెందారు. పోలీస్ సిబ్బంది సంక్షేమ నిధి నుంచి ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ అక్తరున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement