రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర జిల్లాల్లో ఒక్కసారిగా ఉద్యమ వాతావరణం నెలకొంది. జూలై 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీడబ్ల్యూసీ తీర్మానం అనంతరం కేంద్రం తెలంగాణపై తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో సీమాంధ్రలో ఉద్యమం రగులుకుంది.
అనంతపురం: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర జిల్లాల్లో ఒక్కసారిగా ఉద్యమ వాతావరణం నెలకొంది. జూలై 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీడబ్ల్యూసీ తీర్మానం అనంతరం కేంద్రం తెలంగాణపై తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో సీమాంధ్రలో ఉద్యమం రగులుకుంది. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర నినాదంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ అడుగుడుగునా ధర్నాలూ, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఉద్యమంలో పాల్గొని తమ మద్దుతును పలుకుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై ముందే సంకేతాలిచ్చినా ప్రజలు ఆలస్యంగా మేల్కొన్నరంటూ గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తప్పుచేసిందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రుల అభిప్రాయాలను కాంగ్రెస్ పెద్దలు గౌరవించలేదని మధుసూదన్‌గుప్తా విమర్శించారు.