వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం 

CM YS Jagan Taken New Decisions About Village Developments In AP - Sakshi

సాక్షి, విజయనగరం : సచివాలయాలకు మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీటికి పెద్ద పీట వేస్తున్నారు. గ్రామాల్లోని అన్ని సేవలు సచివాలయాల ద్వారా అందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీటిలో పని చేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకం కూడా పూర్తి కావచ్చింది. అంతకుముందే సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయమూ విధితమే. దీనికోసమే ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు. లేని చోట అదనపు భవనాలను నిర్మించేందుకు రూ.25లక్షల చొప్పున విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం.. 
సచివాలయాల్లో అన్ని శాఖల అధికారులు అం దుబాటులో ఉండి, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసమే సీఎం జగన్‌ సచివాలయాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకడుగు వేయడం లేదు. వాటికి మంచి భవనాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పంచాయతీ భవనాలు ఉన్నవాటికి అదనంగా భవనాలు నిర్మించేందుకు రూ.25 లక్షల నిధులను విడుదల చేస్తున్నారు. శిథిలావస్థలో భవనాలు ఉన్న చోట రూ.40 లక్షలతో భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి.

దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి భవనాల స్థితిగతులు, జియోట్యాగింగ్‌ వివరాలను అప్‌లోడ్‌ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారులు వివరాలను జియోట్యాగింగ్‌ చేయిస్తున్నారు. అయితే జిల్లాలో అదనపు భవనాలు నిర్మించాల్సిన సచివాలయాల సంఖ్య 392 ఉండగా, శిథిలాలవస్థకు చేరి కొత్త భవనాలు నిర్మించాల్సినవి 272గా ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top