అసెంబ్లీలో సీఎంవి అన్నీ అబద్ధాలే | Chief minister kiran kumar reddy spoken All lies in assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సీఎంవి అన్నీ అబద్ధాలే

Feb 1 2014 3:52 AM | Updated on Sep 2 2017 3:13 AM

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినన్ని రోజులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడిండు.. తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేసిండు..

చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, న్యూస్‌లైన్  : అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినన్ని రోజులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడిండు.. తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేసిండు.. తెలంగాణ ఏర్పాటైతే, మీకు కరెంటే ఉండదన్నడు.. ఇప్పుడు కలిసే ఉన్నాం కదా.. మరి రైతాంగానికి 7గంటల కరెంటు ఎక్కడ ఇస్తుండ్రు.. అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నిం చారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ధూంధాం కార్యక్రమంలో ప్రసంగించారు.
 
 అసెంబ్లీలో సీఎం మాట్లాడినపుడు తెలంగాణ ఏర్పాటైతే కరెంటే ఉండదన్నడు, ఇప్పుడు సమైక్య రాష్ట్రం లోనే ఉన్నాం కదా, వ్యవసాయానికి 7గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 5గంటలకు మించి విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. దీంతో ఇప్పుడే వరినాట్లు, దుక్కులు పారక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేశాడన్నారు.
 
 1956కు ముందు తెలంగాణలో 5శాతం మాత్రమే వ్యవసాయ బావులు, బోర్లు ఉండేవని, సమైక్య రాష్ట్రంలో నేడు 55శాతానికి చేరాయని, ఉచితంగా విద్యుత్‌ను ఇస్తున్నామని చెప్పారన్నారు. సీమాంధ్రలో ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టి, కాలువలు తవ్వి, ఎకరానికి రూ.200 తీసుకొని, రెండు పంటలకు నీరిస్తుందన్నారు. తెలంగాణలోనేమో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరు బావులు తవ్వి, కరెంటు సాంక్షన్లు తెచ్చుకొని, మోటార్లు ఏర్పాటు చేసుకుంటే, ఎకరానికి రూ.2లక్షల ఖర్చు వస్తుందన్నారు. ఇదే తెలంగాణ రైతుల అదృష్టం అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలది 60ఏళ్ల న్యాయమైన పోరాటం కాబట్టే, నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement