విజయవాడ పరిసరాల్లోనే ఏపీ రాజధాని: బాబు | Chandrababu naidu announce ap capital in vijayawada surroundings | Sakshi
Sakshi News home page

విజయవాడ పరిసరాల్లోనే ఏపీ రాజధాని: బాబు

Sep 4 2014 11:17 AM | Updated on Aug 18 2018 5:48 PM

విజయవాడ పరిసరాల్లోనే ఏపీ రాజధాని: బాబు - Sakshi

విజయవాడ పరిసరాల్లోనే ఏపీ రాజధాని: బాబు

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సందిగ్ధతకు తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గురువారం శాసనసభలో ప్రకటన చేశారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సందిగ్ధతకు తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గురువారం శాసనసభలో ప్రకటన చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓవైపు ప్రతిపక్ష సభ్యుల నిరసన, ఆందోళన మధ్యే చంద్రబాబు రాజధానిపై అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.  కొత్తగా మూడు మెగా సిటీలు ఏర్పాటు చేస్తామని, అలాగే అదనంగా 14 స్మార్ట్ సిటీలు నిర్మిస్తున్నామన్నారు.

అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నారు. అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ అంతటా వికేంద్రీకరిస్తామని చంద్రబాబు తెలిపారు. రాజధానిపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సభను అడ్డుకోవటం సరికాదనన్నారు. సభ హుందాగా నడిచేలా చూడాలన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరారు. రాజధానిపై ప్రకటన పూర్తయింది, ఇక చర్చ చేయవచ్చని బాబు తెలిపారు. భూసేకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీని  ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement