బయట పడిన బాబు నిజస్వరూపం | chandra babu naidu Real identity showed | Sakshi
Sakshi News home page

బయట పడిన బాబు నిజస్వరూపం

Jul 4 2014 2:44 AM | Updated on Jul 28 2018 6:33 PM

‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజస్వరూపం అధికారం చేపట్టిన నెలతిరగక ముందే బట్టబయలు అవుతోంది. ఎన్నికల ముందు రైతులకు, సామాన్య ప్రజలకు విద్యుత్ చార్జీల భారం ఏ మాత్రం ఉండదని ప్రచారం చేసిన చంద్రబాబు..

కోవూరు : ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజస్వరూపం అధికారం చేపట్టిన నెలతిరగక ముందే బట్టబయలు అవుతోంది. ఎన్నికల ముందు రైతులకు, సామాన్య ప్రజలకు విద్యుత్ చార్జీల భారం ఏ మాత్రం ఉండదని ప్రచారం చేసిన చంద్రబాబు.. విద్యుత్ చార్జీల పెంపు తప్పదని పరోక్షంగా ప్రకటించి తన అసలు వైఖరి చాటుకున్నారు’ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడులో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.
 
 రైతులకు ఉచిత విద్యుత్ దేవుడెరుగు విద్యుత్ చార్జీలు, గిట్టుబాటు ధరలేక ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే త్వరలో విద్యుత్ చార్జీలు పెంపు అనివార్యమని ప్రకటించడం ఆయన దగాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు.తాను ఇక ప్రజలు, రైతు సంక్షేమానికి పాటుపడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నెల వ్యవధిలోనే ఇలా మాట మార్చడం దారుణమన్నారు. సెంటు భూమికి కూడా నీరు అందక రైతులు సతమతమవుతున్నారన్నారు.
 
 రైతుకు 9 గంటలు విద్యుత్ ఇస్తామన్న ప్పటికీ కనీసం 3 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతు లు లబోదిబోమంటున్నారన్నారు. గతంలో ఆయన పాలనలో విద్యుత్ చార్జీలు తగ్గించమని ఆందోళనకు దిగిన సీపీఎం కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు అసలు స్వరూపాన్ని గుర్తించాలని కోరారు. ఆయన వెంట  వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ములుమూడి వినోద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మోహిద్దీనా సర్పంచ్ గడ్డం రమణమ్మ, నాయకులు మల్లికార్జునరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, నరసింహులురెడ్డి, జనార్దన్‌రెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, భాస్కర్‌రెడ్డి, రాధయ్య, అహమ్మద్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement