రైతు రుణాల మాఫీపై కమిటీ?

తెలంగాణలో పంట రుణాల మాఫీ అంశం కాస్తా గందరగోళానికి దారితీయడంతో ఇప్పుడు తాను హామీ ఇచ్చిన పంట రుణాల మాఫీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. 2013-14 సంవత్సరానికి సంబంధించిన రుణాలే మాఫీ చేస్తామని, లక్షలోపు రుణాలే రద్దవుతాయని, బంగారు నగలు కుదువపెట్టి తీసుకున్న రుణాలు దీని పరిధిలోకి రావని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీ అమలుకు ఓ కమిటీ వేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ మేరకు ప్రభుత్వాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. 2014 మార్చి వరకు ఉన్న మొత్తం రుణాలు రూ. 59,105 కోట్లుగా లెక్క తేల్చారు. ఇందులో పంట మీద తీసుకున్నవి రూ. 34,067 కోట్లు, గోల్డ్ లోన్స్ రూ.20,137 కోట్లు ఉన్నాయి. అలాగే లక్ష రూపాయల లోపు రుణాలు మాత్రమే చూసుకుంటే ఆ మొత్తం రూ. 22,143 కోట్లు అవుతుంది.
మరిన్ని వార్తలు