విశాఖపట్టణం జిల్లా అనంతగిరిలో బుధవారం ఉదయం 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
విశాఖపట్టణం జిల్లా అనంతగిరిలో బుధవారం ఉదయం 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరితో పాటు.. గంజాయి రవాణాకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
ముందస్తు సమాచారం మేరకు అనంతగిరి ఎస్‌ఐ దామోదరనాయుడు రహదారిలో కాపుకాసి కారును ఆపారు. పెద్దబయలు నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.