లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి | btech student dies in west godavari district road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

Jan 3 2016 7:23 PM | Updated on Sep 28 2018 3:41 PM

కొవ్వూరు మండలం ఐ.తంగిడి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు.

పశ్చిమ గోదావరి జల్లా: కొవ్వూరు మండలం ఐ.తంగిడి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. గోపాలపురం ప్రాంతానికి చెందిన ప్రదీప్‌రెడ్డి బైక్‌పై వెళుతుండగా అతివేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement