మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
గుంటూరు: మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలకు గాను ఆయన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేసిన ఆయన.. మహిళల పట్ల ఇలా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బిహార్ ఫలితాలపై బొత్స మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కెటాయించకపోతే బీజేపీకి ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని అన్నారు.