తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం బాయిలర్ పేలుడు సంభవించింది.
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అన్నవరం పట్టణానికి చెందిన కె.కొండబాబు, జి.శివప్రసాద్ అనే యువకులు స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో హోటల్ లోని బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాద సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.