పురంధేశ్వరి చైర్‌పర్సన్‌గా బీజేపీ మేనిఫెస్టో కమిటీ 

BJP Manifesto Committee as Purandeswari Chairperson - Sakshi

కన్వీనర్‌గా ఐవైఆర్‌ కృష్ణారావు  

సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని మేనిఫెస్టో చైర్‌పర్సన్‌గా, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును కన్వీనర్‌గాను నియమించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా పి.విజయబాబు, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్, దాసరి శ్రీనివాసులు, షేక్‌ మస్తాన్, పాకా సత్యనారాయణ, కె.కపిలేశ్వరయ్య, పి.సన్యాసిరాజు మురళి, సుధీష్‌ రాంబోట్ల, ప్రొఫెసర్‌ డీఏఆర్‌ సుబ్రమణ్యంను నియమించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top