‘కాషాయం’ చాటున భూదందాలు!

BJP Activists Distributing Fake Documents Of Lands To Poor In Nellore - Sakshi

కావలిలో శృతిమించుతున్న  బీజేపీ నాయకుల ఆగడాలు

కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్‌సీపీపై విమర్శలు

భూదందాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని అధికారుల హెచ్చరిక

సాక్షి, కావలి (నెల్లూరు): పట్టణంలో బీజేపీ భూదందాలు శృతిమించుతున్నాయి. కావలి పట్టణంలోని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను ఆక్రమించుకోవడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం అనంతరం పార్టీ ముసుగులో అధికారులను బెదిరించడం కావలిలో నిత్యకృత్యమైపోయాయి. పనిలో పనిలో అధికార వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు చేసి తమ దందాలో ఎక్కడా జోక్యం చేసుకొని తమకు అడ్డు పడకుండా కట్టడి చేసే విధంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

బీజేపీ నాయకుల తీరు!
పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్‌లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలను బీజేపీ నాయకురాలు పేదలు వద్ద వసూళ్లకు పాల్పడి వారికి నకిలీ పట్టాలు ఇచ్చింది. ఆ స్థలాలు వద్దకు వెళ్లిన పేదలను అసలు యజమానులు అడ్డుకొన్నారు. దీంతో రెక్కల కష్టాన్ని బీజేపీ నాయకురాలుకు ఇచ్చిన పేదలు ఆందోళన చెంది, తమల్ని ఇలా చేశారేమిటని ప్రశ్నిచడంతో, ఆమెకు పార్టీలో ఒకరిద్దరు నాయకులు అండగా నిలబడ్డారు. బీజేపీ నాయకురాలు బాధితులైన పేదలు నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కలిసి తమగోడు చెప్పకొన్నారు. అలాగే అధికారులను కలిసి తాము మోసపోయిన వైనాన్ని కన్నీటిపర్యంతమై తెలియజేశారు. దీంతో అధికారులు విచారించి పేదలు మోసపోయారని గుర్తించి, న్యాయం చేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా అధికారులను కలిసి...‘జరిగిందేదో జరిగిపోయింది పేదలకు న్యాయం చేయాలి’ అని కోరారు. చివరిగా రెవెన్యూ అధికారులు బీజేపీ నాయకురాలి బాధితులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

వ్యూహాత్మకంగా కమిషన్‌ ఏర్పాటు
బీజేపీ నాయకులు అధికారులను భయపెట్టి తమకు అనుకలూంగా మలుచుకోవాలని వ్యూహాత్మకంగా జాతీయ ఎస్సీ, బీసీ కమీషన్‌ సభ్యులను కావలికి తీసుకొచ్చి విచారణ జరిపించారు. వారు కూడా ఇంటి పట్టాలు కావాలంటే అధికారులు ఇవవాలే కాని, ప్రవేటు వ్యక్తులు ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేయడంతో స్థానిక బీజేపీ నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లు అయింది. ఇది ఇలా ఉండగా చివరి అస్త్రంగా సాక్షత్తూ ఐఏఎస్‌ అధికారి అయిన కావలి సబ్‌ కలెక్టర్‌ను బెదిరించి తొంగదీసుకోవాలని బీజేపీ నాయకులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించినప్పటికీ ఆయన బెదరలేదు. దీంతో చేసేది ఏమీ లేక ఆ వ్యహారాన్ని పక్కనపెట్టేశారు.

ఇక పట్టణంలోని మద్దూరుపాడు వద  1986   రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఫ్లాట్లుగా అమ్మేసిన స్థలాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటిపై కన్నుపడిన ఒక బీజేపీ నాయకుడు మరో ఇద్దరిని కలుపుకొని అక్కడ  10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలాలను బీజేపీ నాయకుడు, మరికొందరు కలిసి ఆక్రమించుకొని కంచె వేసి మళ్లీ ఫ్లాట్లుగా తయారు చేసి అమ్మకాలకు సిద్ధమౌతున్నారని అధికారులను కలిసి మొర పెట్టుకొన్నారు. ఫ్లాట్ల యజమానులను తీవ్రస్థాయిలో బెదించారు. ఈ స్థలాలు విషయంలో పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సమస్యను ను నేటి వరకు అధికారులు తేల్చనే లేదు.

ముసునూరులోనూ భూదందా
ముసునూరులోనే పమిడి స్కూలును ఆనుకొని ఎకరా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి బీజేపీ నాయకుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాధీనం చేసుకొన్నాడు. వీటిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ భూములన్నీ కూడా బహిరంగ మార్కెట్‌లో రూ. కోట్లు విలువ చేసేవి కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపధ్యంలో కావలి బీజేపీలో భూదందాలు చేసే వారిలో తీవ్ర అసహనం నెలకొంది. అధికారులు తమకు లొంగి అణిగిమణిగి ఉండి తమకు అడ్డు రాకుండా ఉండాలంటే, మొదట అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేను, ఆ పార్టీ నాయకులు గురించి ఏదో ఒక విధంగా రోడ్డెక్కి గోల చేస్తే కాని పరిస్థితులు తమకు అనుకూలంగా ఏర్పడవనే అభిప్రాయానికి వచ్చారు.

ఈ నేపధ్యంలో వారికి డబ్బును ఇవ్వగలిగిన కొత్త వ్యక్తి చేతిలో ఉండటంతో ఆయనకు నాయకత్వం పెంచుతామని చెప్పి, సోమవారం కావలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద భూదందాలు, బెదింపులు అంటూ  ధర్నా చేసారు. ఇందుకోసం కావలి టౌన్, కావలిరూరల్, జలదంకి, బోగోలు మండలాలాల్లోని పేదలకు కావలికి ఆటోలో వచ్చి వెళ్లితే రూ.100 ఇస్తామని చెప్పడంతో, పలువురు వచ్చారు. వయోభారంతో ఉన్న వారు కూడా బీజేపీ వారు సమకూర్చిన ఆటో ఎక్కి కావలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top