రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి | Bifurcation only for Political Benefits, says Sabbam Hari | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి

Dec 29 2013 12:36 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి - Sakshi

రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి

కేంద్రం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన చేస్తొందంటూ ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. సమైక్య ముసుగులో అన్నీపార్టీలు రాజకీయం చేస్తున్నాయని సబ్బం విమర్శించారు.

హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన చేస్తోందని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. సమైక్య ముసుగులో అన్నీపార్టీలు రాజకీయం చేస్తున్నాయని సబ్బం విమర్శించారు. ఆదివారమిక్కడ ఏపీ ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  విభజనే వద్దనుకున్నప్పుడు ఏం కావాలో అడిగే పరిస్థితి రాదని అన్నారు. విభజన అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొనాలని సబ్బం హరి తెలిపారు.

కాగా, ఈ సమావేశానికి ఆయనతోపాటు ఎంపీ అమలాపురం కాంగ్రెస్ ఎంపీ జివి హర్షకుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్,  రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావులు హాజరైయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement