
విద్యార్థి మృతదేహం లభ్యం
రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ లో నాలుగు రోజుల కిందట గల్లంతైన కురుపాం విద్యార్థి జి.అన్వేష్ మృతదేహాన్ని అధికారులు
జియ్యమ్మవలస: రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ లో నాలుగు రోజుల కిందట గల్లంతైన కురుపాం విద్యార్థి జి.అన్వేష్ మృతదేహాన్ని అధికారులు ఎట్టకేలకు బయటకు తీశారు. నాలుగు రోజులుగా తీవ్రంగా గాలించిన అధికారులు గురువారం నాటికి మృతదేహం కనుగొనగలిగారు. గురువారం నేవీకి సంబంధించిన రెస్క్యూ టీం వచ్చి అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. అప్పటికీ దొరక్కపోవడంతో వారు తెచ్చిన మరబోటుతో తాళ్లకు కొక్కెం కట్టి డ్యాం లో పల వరకు చుట్టూ తిప్పి నీటిని బురద మయం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఒడ్డుకు చేరుకున్నారు. వారు ఒడ్డుకు చేరిన కొద్ది సేపటికే అన్వేష్ మృతదేహం పైకి తేలింది.
దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఒక్కసారి బోరుమన్నారు. సంక్రాంతి నాడు కూడా సెలవు తీసుకోకుండా అధికారులంతా అక్కడే ఉండి మృతదేహాన్ని గాలించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించామని, నివేదిక అందిన వెంటనే దర్యాప్తు మొదలు పెడతామని ఎస్‌ఐ పప్పల పాపారావు తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం ఇన్‌చార్జి సబ్ కలెక్టరు ఆర్.శ్రీలత, డిప్యూటీ కలెక్టరు (ఐటీడీఏ) టి.సీతారామస్వామి, జిల్లా అసిస్టెంట్ డెరైక్టరు ఆఫ్ ఫిషరీష్ ఫణిప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, జియ్యమ్మవలస తహశీల్దార్ పి.నారాయణరావు, కురుపాం తహశీల్ధార్ ఎం.ప్రకాశ్ పార్వతీపురం సర్కి ల్ ఇన్‌స్పెక్టరు వి.చంద్రశేఖర్, జియ్యమ్మవలస, కురుపాం, చినమేరంగి ఎస్సైలు ఏ.హరికృష్ణ, అశోక చక్రవర్తి, పప్పల పాపారావు, ఆర్‌ఐ శంకరరాయుడు, వీఆర్వోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కురుపాంలో విషాద ఛాయలు
కురుపాం: అన్వేష్ (15) మృతితో మం డల కేంద్రంలోని శోభలతాదేవికాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గురువారం సాయంత్రం నేవీ రెస్క్యూ టీమ్ గాలింపులో అన్వేష్ మృతదేహం బయటపడటంతో వెంట నే జియ్యమ్మవలస పోలీసులు మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.