చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు! | at last chiranjeevi vacates akbar road bungalow | Sakshi
Sakshi News home page

చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు!

Dec 10 2014 12:10 PM | Updated on Sep 2 2017 5:57 PM

చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు!

చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు!

కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఎట్టకేలకు ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేశారు.

కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఎట్టకేలకు ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అక్బర్ రోడ్డులోని నెం.17 బంగ్లా కేటాయించారు. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఆ బంగ్లాను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటాయించారు. దాంతో బంగ్లాను ఖాళీ చేయాలంటూ పలుమార్లు చిరంజీవికి ఎస్టేట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

అయినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో అక్టోబర్‌ 30వ తేదీన చివరి నోటీసును బంగ్లా గేటుకు అంటించారు. దాంతో.. రెండు వారాల్లో బంగ్లా ఖాళీ చేస్తానని చిరంజీవి వారికి తెలిపారు. ఆయన తన బంగ్లాను ఖాళీ చేసి, సామానును రెండు ట్రక్కుల్లో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. కారును మాత్రం ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఇంట్లో ఉంచారు. చిరంజీవికి తుగ్లక్‌ రోడ్డులో బంగ్లాను కేటాయించినట్లు రాజ్యసభ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement