ఆయనెవరో నాకు తెలియదు.. | Ashok Gajapati Raju comments about Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఆయనెవరో నాకు తెలియదు..

May 10 2017 2:00 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఆయనెవరో నాకు తెలియదు.. - Sakshi

ఆయనెవరో నాకు తెలియదు..

‘మీరేదో పేరు చెప్పారు.. ఆయనెవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమావాడట..

పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్య

ద్వారకాతిరుమల: ‘మీరేదో పేరు చెప్పారు.. ఆయనెవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమావాడట.. నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను..’ జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి కేంద్ర పౌరవిమాన యానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చిన ఆయన మంగళ వారం విర్డ్స్‌ ఆస్పత్రిలో ఆర్థోస్కొపీ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరు లతో మాట్లాడారు.

టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ అధికారిని నియమించడంపై పవన్‌కల్యాణ్‌ చేసిన ట్వీట్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా.. అశోక్‌  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఎవరో తనకు తెలియదని తనదైన శైలిలో పైవిధంగా సమాధానమిచ్చారు. గన్న వరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం హర్షణీయమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement