వారు 'రక్తకన్నీరు నాగభూషణం'లే! | Ashok Babu Warns Seemandhra Union ministers | Sakshi
Sakshi News home page

వారు 'రక్తకన్నీరు నాగభూషణం'లే!

Dec 7 2013 10:48 AM | Updated on Sep 27 2018 5:59 PM

వారు 'రక్తకన్నీరు నాగభూషణం'లే! - Sakshi

వారు 'రక్తకన్నీరు నాగభూషణం'లే!

సీమాంధ్ర కేంద్ర మంత్రులపై ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : 'ఏది పోయినా ఫర్వాలేదు... పదవి పోతే బతకలేం' అని రక్తకన్నీరు సినిమాలో నాగభూషణం చెప్పిన ఈ డైలాగు సీమాంధ్ర కేంద్ర మంత్రుల విషయంలో సరిగ్గా సరిపోతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తమ మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నంలో నోరు మెదపకుండా ఉండిపోయిన సీమాంద్ర కేంద్ర మంత్రుల నిర్వాకం కారణంగానే రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధమైందని ఆయన విమర్శించారు.

ఈ పరిస్థితిలో ప్రజల ఆగ్రహావేశాలను చూస్తుంటే వారితోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై భౌతిక దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు.  ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని అశోక్ బాబు తెలిపారు. కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం  శుక్రవారం సీమాంధ్రలో బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement