నకిలీ పాస్ పుస్తకాల సృష్టికర్త అరెస్టు | arrest of the creator of the fake pass books | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్ పుస్తకాల సృష్టికర్త అరెస్టు

Dec 17 2013 4:28 AM | Updated on Aug 21 2018 9:20 PM

నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి..బ్యాంకులను మోసం చేసి, లక్షలాది రూపాయల రుణాలు పొందిన సనపల చలపతిరావును

ఆమదాలవలస, న్యూస్‌లైన్:నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి..బ్యాంకులను మోసం చేసి, లక్షలాది రూపాయల రుణాలు పొందిన సనపల చలపతిరావును  ఎస్సై మంగరాజు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు శాఖలో చలపతిరావు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో రూ.65,00 రుణం పొందాడని బ్యాంకు మేనేజర్ వి.సురేష్‌రాజు ఈనెల 11న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అరెస్టు చేశామన్నారు. గతంలో చలపతిరావు నకిలీ పాస్‌పుస్తకాలను సృష్టించి..తహశీల్దార్ వీర్రాజు సంతకాలను ఫోర్జరీ చేసి, పలు బ్యాంకుల్లో రుణాలు పొందాడని అందిన ఫిర్యాదు మేరకు ఓ సారి అరెస్టు  చేశామని, అయితే ఆయన ముందస్తు బెయిల్ తీసుకోవడతో..విడుదల చేశామని చెప్పారు. నిందితుడు పలువురు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేశాడని..వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement