ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ | ap mlc notification relaease tomorrow by bhanwar lal | Sakshi
Sakshi News home page

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్

Jun 8 2015 5:34 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఏపీలో 12 స్థానాలకు స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికలు జరగనున్నాయి. జూలై 3న ఎన్నికలు జరుగుతాయి.

ఈ మేరకు భన్వర్ లాల్ మాట్లాడుతూ.. 'జూన్ 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 19న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. జూలై 3న పోలింగ్.. అదే నెల 7న లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,400 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ అనుకూలంగా 35 కేంద్రాలను ఏర్పాటు చేశాం' అని అన్నారు.

అదే విధంగా ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఏపీలోని 9 జిల్లాల్లో ఎన్నికల కోడ్  అమలు చేయనన్నట్టు ఈ సందర్భంగా భన్వర్ లాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement