ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణపై పిటిషనర్లు వ్యక్తం చేసిన
ఏపీ భూ సమీకరణ అభ్యంతరాలపై హైకోర్టు
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణపై పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై చట్టంలో నిర్దేశించిన గడువులోపు నిర్ణయం వెలువరించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాలకు వీలుంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ కింద చేస్తున్న భూ సమీకరణ నుంచి తమ భూములను మినహాయించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేశారు.