మీ మనవడిని.. మీ ‘కంటి వెలుగు’ని..

AP CM YS Jagan Mohan Reddy Talks In Anantapur YSR Kanti Velugu Programme - Sakshi

కరువు సీమ మురిసిపోయింది. రాజన్న బిడ్డకు అడుగడుగునా బ్రహ్మరథం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో తొలి అడుగు వేసిన వైఎస్‌ జగన్‌ను జిల్లా ప్రజానీకం అక్కున చేర్చుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అనతికాలంలోనే హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. ప్రజల ‘కంటి వెలుగు’గా మారిన సీఎం మరోసారి అనంతపురం జిల్లాపై వరాల వర్షం కురిపించారు. తన చిరునవ్వులతో అందరి హృదయాలను చూరగొన్నారు. 

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు విచ్చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంత రైతాంగంపై వరాల జల్లు కురిపించారు. తాగు, సాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గురువారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం జిల్లా వాసులను ఆకట్టుకుంది. హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీరుకూడా రావడం లేదన్నారు. ఈ కాలువను ఆధునీకరించి 6వేల క్యూసెక్కుల నీటిని ఇదే కాలువ గుండా ప్రవహించేలా చేస్తామన్నారు. ఇదొక్కటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4వేల క్యూసెక్కుల సామర్థ్యం కల్గిన సమాంతర కాలువ పనులు కూడా చేపడతామన్నారు. జిల్లాను దేవుడు ఆశీర్వదించాడని, పదేళ్లుగా ఎప్పుడూ నిండని విధంగా ఈసారి చెరువులు నిండాయన్నారు. ‘గతంలో దివంగత నేత వైఎస్‌ హయాంలో చూశాం. మళ్లీ ఇవాల మా మనవడి పరిపానలో చూస్తున్నామని సగర్వంగా జిల్లా ప్రజలు చెబుతున్న మాటలు వింటున్నా’ అన్నారు. మీ అందరి తోడు, ఆశీస్సులు, దీవెనులు మీ బిడ్డకు ఇవ్వండి. మీ అందరి మన్ననలు పొందేలా పరిపాలన చేస్తాడని హామీ ఇచ్చారు.  

బీసీల గుండెల్లో జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోయారు: మంత్రి శంకరనారాయణ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. జ్యోతిరావు ఫూలే ఆలోచనలకు అనుగుణంగా ఆయా వర్గాలకు నామినేటెడ్‌ పదువులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పరిశ్రమల్లోనూ స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు అడుగులేస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్‌ ఇక్బాల్, కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, డాక్టర్‌ సిద్దారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్తికేయమిశ్రా

ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ అరుణకుమారి, జేసీ డిల్లీరావు, కమిషనర్‌ పి.ప్రశాంతి, జేసీ–2 సుబ్బరాజు, డీఎంఈ డాక్టర్‌ వెంకటేశ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎంపీ కల్నల్‌ నిజాముద్దీన్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, గురునాథరెడ్డి, శివరామిరెడ్డి, నాయకులు నదీంఅహమ్మద్, నవీన్‌నిశ్చల్, మహలక్ష్మీ శ్రీనివాస్, ఆలూరి సాంబశివారెడ్డి, రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప, రైతు మిషన్‌ సభ్యులు రాజారాం, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ లింగాల శివశంకర్‌రెడ్డి, వైవీ శివారెడ్డి, తోపుదుర్తి చందు, వీఆర్‌ రామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, గౌస్‌బేగ్, వెన్నపూస రవీంద్రారెడ్డి, బీసీ రమేష్‌గౌడ్, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top