పార్టీలో చేరికలు, సభ్యత్వ నమోదుపై చర్చ

AP BJP Leaders Meeting At Guntur Haailand - Sakshi

సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్‌, వి మురళీదరన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నేత మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. భారత్‌ మాతా కీ జై అనే పలికి.. దేశం కోసం పని చేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం.. ఇందిరా గాంధీ తరహా పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని మురళీధర్‌ రావు పేర్కొన్నారు.

తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు మురళీధర్‌ రావు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ లేదు.. ఇక టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. బీజేపీకి 11 కోట్ల మందితో సభ్యత్వం ఉందని.. ప్రపంచంలో ఏ పార్టీకి ఇంత భారీ సభ్యత్వం లేదన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు తేడా లేదని.. రెండూ కాళ్లు పట్టుకునే పార్టీలే అని విమర్శంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చే నెల జూలై 6 నుంచి ఆగస్టు11 వరకూ సంఘటనా పర్వత్‌ పేరుతో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top