కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా గురువారం శాసనసభ 8 తీర్మానాలను కూడా ఆమోదించింది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా గురువారం శాసనసభ 8 తీర్మానాలను కూడా ఆమోదించింది.
ఇవీ తీర్మానాలు:
హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన తీరుపై శాసనసభ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
ఏపీలోని అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
రాజధానిగా విజయవాడను అభివృద్ధి చేయడానికి సంపూర్ణ సహకారం కావాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాం.
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ప్రతిపాదనలు, హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
ఏపీకి సమన్యాయం చేసే విధంగా కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆర్ధిక, విధానపరమైన విషయాల్లో కేంద్రం మద్దతు అందించాలి.
వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి.
శాసనమండలి సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగినందున దాన్ని సవరించి ఆ స్థానాలను 58కి పెంచాలి.