తిరుమల భద్రతకు ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌ | anti terror cell very soon in tirupati,say DGP | Sakshi
Sakshi News home page

తిరుమల భద్రతకు ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌

Feb 2 2014 1:15 AM | Updated on Aug 28 2018 5:55 PM

తిరుమల భద్రతకు ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌ - Sakshi

తిరుమల భద్రతకు ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌

తిరుమల భద్రతకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ), ఆక్టోపస్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తాయని డీజీపీ బి.ప్రసాదరావు వెల్లడించారు.

సాక్షి, తిరుమల : తిరుమల భద్రతకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ), ఆక్టోపస్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తాయని డీజీపీ బి.ప్రసాదరావు వెల్లడించారు. శనివారం ఆయన తిరుమలలోని ఆక్టోపస్ యూనిట్‌ను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్‌ఎస్‌జీ బృందంతో ఆక్టోపస్ కలసి పనిచేస్తుందన్నారు.

ఇక్కడి అవసరాలు, పరిస్థితిని బట్టి యూనిట్‌ను పెంచుతామన్నారు. పరికరాలు, సిబ్బందిని సంఖ్య పెంచేందుకు ఇక్కడ సౌకర్యాలు, స్థలం సరిపోవటం లేదన్నారు. దీనిపై టీటీడీ ఈవోతో చర్చిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శ్రీవారి ఆలయ ప్రాకారాలు, గోడల వద్దకు చాలా సులువుగా చేరుకునేలా నిత్యం కమాండోలు ప్రత్యేక శిక్షణ(మాక్‌డ్రిల్) పొందుతున్నారన్నారు. కాగా, శ్రీవారిని డీజీపీ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పచ్చకర్పూరపు వెలుగులో మూలమూర్తిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement