breaking news
anti terror cell
-
రూ.1,000 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో మరోమారు భారీస్థాయిలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మంగళవారం పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వడోదరలోని ఓ గోదాంపై దాడి చేపట్టింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఈ దాడుల్లో 200 కిలోల మెఫెడ్రోన్ దొరికినట్టు అధికారులు తెలిపారు. భరుచ్ జిల్లాలో ఔషధాల ముసుగులో దీన్ని తయారు చేసినట్టు తేలిందన్నారు. ఇందుకు సంబంధించి పలువురికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిషేధిత మెఫెడ్రోన్‌ను మ్యావ్ మ్యావ్, ఎండీగా కూడా పిలుస్తారు. ఇదీ చదవండి: ఎంఎస్పీ కమిటీ భేటీని బహిష్కరించిన రైతు సంఘాలు -
తిరుమల భద్రతకు ఎన్ఎస్జీ, ఆక్టోపస్
సాక్షి, తిరుమల : తిరుమల భద్రతకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ), ఆక్టోపస్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తాయని డీజీపీ బి.ప్రసాదరావు వెల్లడించారు. శనివారం ఆయన తిరుమలలోని ఆక్టోపస్ యూనిట్‌ను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ఎస్జీ బృందంతో ఆక్టోపస్ కలసి పనిచేస్తుందన్నారు. ఇక్కడి అవసరాలు, పరిస్థితిని బట్టి యూనిట్‌ను పెంచుతామన్నారు. పరికరాలు, సిబ్బందిని సంఖ్య పెంచేందుకు ఇక్కడ సౌకర్యాలు, స్థలం సరిపోవటం లేదన్నారు. దీనిపై టీటీడీ ఈవోతో చర్చిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శ్రీవారి ఆలయ ప్రాకారాలు, గోడల వద్దకు చాలా సులువుగా చేరుకునేలా నిత్యం కమాండోలు ప్రత్యేక శిక్షణ(మాక్‌డ్రిల్) పొందుతున్నారన్నారు. కాగా, శ్రీవారిని డీజీపీ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పచ్చకర్పూరపు వెలుగులో మూలమూర్తిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు.