6 నెలల పాలనలో అతిపెద్ద విజయం | Sakshi
Sakshi News home page

పౌర సమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’

Published Sat, Nov 30 2019 6:46 PM

Andhra Pradesh Successfully Implemented Spandana Programme - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలవుతోంది. జూన్‌ 24, 2019న కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్‌ సందర్బంగా స్పందన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. వివిధ సమస్యలపై పౌరుల నుంచి వినతుల స్వీకరణ, నిర్ణీత కాలంలో పరిష్కారమే లక్ష్యంగా స్పందన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరంతర సమీక్షలతో స్పందనపై అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్‌ తీసుకువచ్చి, ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నడిపించారు.

తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులు కేటాయించడంతో పాటు ఆకస్మిక తనిఖీలకూ ఆదేశాలు సీఎం ఆదేశాలిచ్చారు. రోజుల తరబడి తమ తమ సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగిన ప్రజలకు అధికారుల నుంచి జవాబుదారీతనం.. సమస్యకు రశీదు, పరిష్కారం పొందిన తర్వాత మళ్లీ ప్రజలకు తెలియజేసేలా విధాన రూపకల్పన చేశారు. తిరస్కరించిన వాటికీ సహేతుక కారణాలతో వివరణ ఇవ్వడం, పెండింగులో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం చెప్పేలా చేశారు. ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై ఆరు నెలల కాలంలో స్పందనలో లక్షల కొద్దీ వినతులు వచ్చాయి. (చదవండి: 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా..)

78.2 శాతం పరిష్కారం
స్పందన ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 13 జిల్లాల్లో వచ్చిన వినతులు 8,15,461
పరిష్కారానికి నోచుకున్న వినతులు 78.2 శాతం, పెండింగులో 7.3 శాతం, తిరస్కరించినవి 14.4 శాతం
రేషన్‌ కార్డులు, ఇళ్లపట్టాలు, పట్టణాల్లో ఇళ్లు, పెన్షన్లు, భూమి సంబంధిత హక్కులు, ఇళ్ల మంజూరు, ఆక్రమణలు.. సంబంధిత అంశాలే ఎక్కువ
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వినతులు
కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఆ తర్వాత సంఖ్యలో వినతులు

జిల్లాల వారీగా...
తూర్పుగోదావరిలో 1,09,876 వినతులు, 80శాతం పరిష్కారం
కర్నూలులో 99,577, 82.4శాతం పరిష్కారం
కృష్ణాజిల్లాలో 97,355 ,  78.9శాతం పరిష్కారం
గుంటూరు జిల్లాలో 82,031,  71.2 శాతం పరిష్కారం
అనంతపురం జిల్లాలో 70,310,  84.2 శాతం పరిష్కారం
ప.గో. జిల్లాలో 68,125 వినతులు, 79.1శాతం పరిష్కారం
విశాఖపట్నం జిల్లాలో 61,613 వినతులు, 75.7శాతం పరిష్కారం
కడప జిల్లాలో  52,318 వినతులు, 74.7 శాతం పరిష్కారం
చిత్తూరు జిల్లాలో 48,008 వినతులు, 73.7 శాతం పరిష్కారం
ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో  36,998 వినతులు, 76.1శాతం పరిష్కారం
శ్రీకాకుళం జిల్లాలో  33,228 వినతులు, 78.9 శాతం
ప్రకాశం జిల్లాలో 31,829 వినతులు, 70.8శాతం పరిష్కారం
విజయనగరం జిల్లాలో 24,193 వినతులు, 86.6 శాతం పరిష్కారం
వినతుల్లో నాణ్యత పెంచడానికి వైఎస్‌ జగన్‌ చర్యలు
అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహణ
జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతులు

పోలీసు శాఖలో స్పందన..
> ప్రతి మంగళవారం జిల్లా ఎస్పీలు, పోలీసు అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష
> వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
> ఫిర్యాదులతో వస్తున్నవారిని మానవతా దృక్పథంతో చూడాలంటూ ఆదేశాలు
> పోలీసు స్టేషన్లు, కార్యాలయాల ముందు హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు
> సివిల్‌ తగాదాలు తక్షణ పరిష్కారానికి రెవిన్యూ అధికారులతో ప్రత్యేక సమన్వయం ఏర్పాటు చేసిన సీఎం
> నవంబర్‌ 25వరకూ, ఇప్పటివరకూ వచ్చిన పిటిషన్లు 44,452 వినతులు. 98శాతం ఫిర్యాదుల పరిష్కారం
> స్పందన వెబ్‌పోర్టల్‌ ద్వారా 8,894 వినతులు. 94 శాతం పరిష్కారం

నేరుగా వచ్చిన పిటిషన్లలో వర్గీకరణ
= సివిల్‌ తగాదాలు 11,525
= బాడీలైన్‌ అఫెన్సెస్‌ 7,188
= మహిళలపై నేరాలకు 6,773
= ఇతర ఫిర్యాదులు 5,490
= వైట్‌కాలర్‌ అఫెన్స్‌లు 4,733
= కుటుంబ తగాదాలు 3,786
= ఆస్తి సంబంధమైన తగాదాలు 2,462
= న్యూసెన్స్‌ 1010
= రోడ్డు ప్రమాదాలు 966
= సైబర్‌ క్రైం 274
= ఎస్సీ,ఎస్టీలపై నేరాలు 245

స్పందన ఇంపాక్ట్‌
# స్పందన కార్యక్రమం వల్ల నేరుగా వచ్చిన 44,452 స్పందన వినతుల్లో 13003 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదు
# వారం రోజుల్లోనే 95శాతం ఫిర్యాదుల పరిష్కారం
# ముఖ్యమంత్రి, డీజీపీల స్వయం పర్యవేక్షణ వల్ల పోలీసుయంత్రాంగంలో పెరిగిన పారదర్శకత, జవాబుదారీతనం
# నిర్ణీత కాలంలోగా వినతులను పరిష్కరించని పోలీసులపై చర్యలు
# మహిళల నుంచి 52శాతం ఫిర్యాదులు. సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయని మహిళల విశ్వాసం
# సమస్యలు ఎదుర్కొంటున్నవారికి సులభంగా అందుబాటులో అధికారులు
# సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు, సంవత్సరాలు తరబడి పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం

Advertisement
Advertisement