మంత్రులు, అధికారులు యోగా కెళ్తే.. | Andhra Pradesh netas, babus to get crash course in well being | Sakshi
Sakshi News home page

మంత్రులు, అధికారులు యోగా కెళ్తే..

Jan 29 2015 9:36 AM | Updated on Jul 28 2018 6:35 PM

మంత్రులు, అధికారులు యోగా కెళ్తే.. - Sakshi

మంత్రులు, అధికారులు యోగా కెళ్తే..

మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులందరికీ యోగా లో అధికారికంగా శిక్షణ ఇప్పించాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయంతో...

సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులందరికీ యోగా లో అధికారికంగా శిక్షణ ఇప్పించాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్రంలో పాలన 3 రోజులపాటు పడకేయనుంది. గురువారం నుంచి ఈ నెల 31 వరకు సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలూ వెలవెలబోనున్నాయి. అయితే దీనికి రూ. 2 కోట్లు వ్యయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఒకపక్క పైసలు లేవంటూ.. ఆర్థిక పొదుపు చర్యలు పాటించాలంటూ జారీ చేసిన జీవోను పక్కనబెడుతూ.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగ శిక్షణకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది.

ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను పెంచేందుకు ఈషా ఫౌండేషన్ ద్వారా ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్’ అనే అంశంపై 3 రోజులు శిక్షణ ఇప్పిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. తొలి దశలో మంత్రులకు, ఉన్నతాధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నామని, మలి దశలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement