పంచాయతీరాజ్ ఈఈ ఇంట్లో సోదాలు | acb rides on Panchayati Raj EE | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్ ఈఈ ఇంట్లో సోదాలు

May 7 2016 12:26 PM | Updated on Aug 17 2018 12:56 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పంచాయతీ రాజ్ ఈఈ నివాసం, కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పంచాయతీ రాజ్ ఈఈ నివాసం, కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈఈ దుర్గాప్రసాద్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు మూడు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. శనివారం విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం నుంచి వచ్చిన ఐదు బృందాలు విశాఖ, రాజమండ్రిలో దుర్గా ప్రసాద్‌కు చెందిన నివాసాలతో పాటు పనిచేస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఐదు ఖరీదైన స్థలాలు, రెండు డూప్లెక్స్ ఇళ్లు, పావు కిలో బంగారం, మూడు కిలోల వెండి వస్తువులు, రూ. 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.లక్ష నగదు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement