లంచం తీసుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి తహశీల్దార్ బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు దొరికారు.
జీలుగుమిల్లి : లంచం తీసుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి తహశీల్దార్ బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు దొరికారు. మండలానికి చెందిన ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు తహశీల్దార్ జి.సాంబశివరావు రూ.10వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం తహశీల్దారుకు పైకం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.