విద్యుత్ తీగ యమపాశమైంది | a man died due to electric wire shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగ యమపాశమైంది

Jan 21 2014 1:16 AM | Updated on Sep 5 2018 3:37 PM

ఓ వ్యక్తి కర్మకాండల్లో పాల్గొనేం దుకు వెళ్లిన రజకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందిన దుర్ఘటన ఉండ్రాజవరం మండలం పాలంగిలో సోమవారం చోటుచేసు కుంది.

 తణుకు క్రైం, న్యూస్‌లైన్ :
 ఓ వ్యక్తి కర్మకాండల్లో పాల్గొనేం దుకు వెళ్లిన రజకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందిన దుర్ఘటన ఉండ్రాజవరం మండలం పాలంగిలో సోమవారం చోటుచేసు కుంది. వివరాలి ఉన్నారుు. ఉండ్రాజ వరం మండలం పాలంగి ధ్వజస్తం భం వీధిలో నివాసముంటున్న రజ కుడు అవిడి శ్రీనివాస్ (40) అదే ప్రాం తానికి చెందిన ఓ వ్యక్తి కర్మకాండల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆల య ప్రాంతంలోని కాలువ రేవుకు వెళ్లాడు. కర్మకాండలు పూర్తయ్యాక అక్కడి సామగ్రిని సర్దుతుండగా సమీపంలోనే నీటిలో ఉన్న విద్యుత్ తీగ అతడి చేతికి తగిలింది.
 
  షాక్‌కు గురైన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణా లు విడిచాడు. అదే సమయంలో కర్మకాండ  జరిపిన వారిలో కొందరు రేవులో ఉండగా వారికి కూడా కొద్దిపాటి విద్యుత్ షాక్ తగిలింది. వారంతా రేవులోంచి బయటకు వచ్చే యడంతో పెనుప్రమాదం తప్పింది. రేవుకు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఉన్న స్తంభం నుంచి రేవులో ఉన్న రక్షణ స్తంభానికి సపోర్టుగా ఈ వైరు వేశారు. ఆ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాస్‌కు భార్య మహాలక్ష్మి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం భార్యతో ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా ప్రస్తుతం భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో అతను గ్రామంలో బంధువుల ఇళ్లకు సమీపంలో ఒంటరిగా నివశిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement