తిరుపతిలో యూనియన్ నేతలతో భేటీ కానున్న ఎ.కె.ఖాన్ | A K Khan meet with apsrtc union leaders at Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో యూనియన్ నేతలతో భేటీ కానున్న ఎ.కె.ఖాన్

Oct 1 2013 9:15 AM | Updated on Aug 20 2018 3:26 PM

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతోంది. దాంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి.

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతోంది. దాంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపించింది. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఏ.కే.ఖాన్ మంగళవారం చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ కార్మిక నేతలతో భేటీ కానున్నారు.

 

ఈ రోజు ఉదయం ఆర్టీసీ అధికారులు, యూనియన్ నేతలతో ఖాన్ చర్చలు జరుపుతారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులతో ఖాన్ సమావేశం అవుతారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఉద్యమాల ఉధృతిని తగ్గించడానికి ఎవరైన తమపై ఒత్తిడి పెంచితే సహించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు సోమవారం సాయంత్రం తిరుపతిలో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెల్చి చేప్పారు. ఓ వేళ అలా చేస్తే ప్రస్తుతం తిరుమలకు నడుస్తున్న బస్సులను కూడా నిలిపివేస్తామని వారు ప్రభుత్వానికి ఈ సందర్బంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement