సుమారు లక్షమందికి హజ్ యాత్రికులకు నో ఎంట్రీ! | 98,000 denied Makkah entry for Haj | Sakshi
Sakshi News home page

సుమారు లక్షమందికి హజ్ యాత్రికులకు నో ఎంట్రీ!

Sep 30 2014 5:52 PM | Updated on Sep 2 2017 2:11 PM

సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది

రియాద్: సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది. సుమారు 98 వేల మంది యాత్రికులకు సరియైన అనుమతి పత్రాలు లేవని సౌదీ అరేబియా గుర్తించింది. హజ్ యాత్రకు సంబంధించిన నియమ, నిబంధనల్ని ఉల్లంఘించిన 85 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
మక్కా నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులు, ఇతర చెక్ పాయింట్ల వద్ద మక్కా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ అబ్దుల్లా భారీ బందోబస్తు విధించారు. గత సంవత్సరం అనుమతి లేని 4 వేల మందిని అడ్డకున్నట్టు సమాచారం. అనుమతుల్లేకుండా ప్రవేశిస్తే దేశ బహిష్కరణతోపాటు, పదేళ్ల నిషేధాన్ని కూడా విధిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement