ఆటో బోల్తా : 8 మందికి గాయాలు | 8 injured as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : 8 మందికి గాయాలు

Aug 21 2015 2:40 PM | Updated on Sep 3 2017 7:52 AM

ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ముందుకి అకస్మాత్తుగా మేకల మంద దూసుకురావడంతో.. అదుపుతప్పి బోల్తా కొట్టింది.

పీటీఎమ్ (చిత్తూరు) : ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ముందుకి అకస్మాత్తుగా మేకల మంద దూసుకురావడంతో.. అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం(పీటీఎమ్) మండలం టి.సదుమ్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగింది.

పీటీఎమ్ నుంచి జి. కొత్తకోటకు వెళ్తున్న ప్రయాణికుల ఆటో టి. సదుమ్ క్రాస్ రోడ్డు వద్ద గల అడవి సమీపంలోకి రాగానే.. ఒక్కసారిగా మేకల మంద రోడ్డుపైకి దూసుకురావడంతో వాటిని తప్పించబోయి ఆటో అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జై డ్రైవర్ సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement